‘సర్దార్’ హిట్ అయితే న్యూడ్‌గా పరిగెడతా! ( Sardaar Gabbar Singh )

0
689

Kamal-R-Khan-640x300

తనకు తాను పెద్ద సినీ విమర్శకుడిని అని ఫీలయ్యే కమాల్ ఖాన్ మరోసారి రెచ్చిపోయాడు. గతంలో పవన్ కళ్యాణ్ ఓ జోకర్ అంటూ కామెంట్స్ చేసిన కమాల్ ఈ సారి సర్దార్‌ గబ్బర్ సింగ్‌పై ఇచ్చినట్లు ట్వీట్ చేశాడు. సర్దార్ హిట్ అయితే తాను తెలుగు రాష్ట్రాల్లో న్యూడ్ గా పరిగెడతా అంటూ ఛాలెంజ్ చేశాడు. వర్మ ట్విట్టర్‌ లో జరిగిన ఈ వ్యాఖ్యల వార్‌ ఏంటి అంటే..

ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా సర్ధార్ గబ్బర్ సింగ్ విడుదల కానుంది. బాలీవుడ్ లో దాదాపు 800 థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది. ఈ సందర్బంగా రామ్ గోపాల్ వర్మ బాహుబలి ఫస్ట్ డే నాడు ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ వద్ద 1.5 కిలోమీటర్ల మేర క్యూ ఉంది, ఇప్పుడు సర్ధార్ గబ్బర్ సింగ్ కు ఎంత పొడవు క్యూ ఉంటుందో చూడలి అంటూ ట్వీట్ చేశాడు. దీనికి కమాల్ ఖాన్ “0” కిలోమీటర్లు అంటూ బదులిచ్చి, పవన్ కంటే హిందీలో బాహుబలి కట్టప్ప పెద్ద స్టార్ అని, పవన్ సినిమాకు ఉచిత టికెట్, రవాణా ఛార్జీలు, కూల్ డ్రింక్స్, పాప్ కార్న్ ఇచ్చినా ఎవరూ వెళ్లరు అంటూ కామెంట్స్ చేశాడు. పవన్ కళ్యాణ్ సినిమాకు ముంబైలో 10 మంది కంటే ఎక్కువ మంది వెళ్తే రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో న్యూడ్ గా పరిగెడతానని ట్వీట్ చేశాడు. కమాల్ ఖాన్ ట్వీట్ కు వర్మ “అయితే సిద్దంగా ఉండు” నీకు పవన్ గురించి తెలియదు అని చెప్పాడు.